
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 84


భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్

ఎన్టీఆర్ పై అమిత్ షా ప్రశంసలు

ఎన్టీఆర్ ఆస్కార్ పై లైగర్ కామెంట్స్

చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పిన మణిరత్నం

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్

లైగర్ టీమ్ ఎమోషనల్

సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి సీతారామం

డబుల్ బ్లాక్ బస్టర్ బింబిసార

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్

#SSMB28 కు పోకిరి సెంటిమెంట్

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

పునీత్ రాజ్ కుమార్ కు లైగర్ నివాళులు

సినీ కార్మికులకై చిరు బర్త్ డే కానుక

బిగ్ బీ బ్లెస్సింగ్స్.. లైఫ్ టైమ్ మెమరీ..

నరేష్ ఉగ్రం ఫస్ట్ లుక్ రిలీజ్
కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం అయితే రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.

భోళా శంకర్ మూవీ రిలీజ్ డేట్
ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్, రష్మీ , శ్రీముఖి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ పై అమిత్ షా ప్రశంసలు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.#NTR30 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఎన్టీఆర్ ఆస్కార్ పై లైగర్ కామెంట్స్
గతకొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డుల బరిలో తారక్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాపై అలానే ఎన్టీఆర్ నటనపై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించడంతో ఎన్టీఆర్ కి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఎన్టీఆర్ ఆస్కార్ పై స్పందించాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘లైగర్’. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మొదటినుండీ అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఉన్న టైమ్ ను చిత్రయూనిట్ మ్యాగ్జిమమ్…

చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పిన మణిరత్నం
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

దసరా బరిలో నాగార్జున ది ఘోస్ట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.

చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడు స్పెషల్ షోస్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన హీరోల బర్త్ డే కు వారి పాత సూపర్ హిట్ మూవీస్ స్పెషల్ షోస్ థియేటర్స్ లో ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కు సూపర్ హిట్ పోకిరి మూవీ స్పెషల్ షోస్ భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ జల్సా మూవీ ని పవన్ కళ్యాణ్ బర్త్ డే కు స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. తాజాగా చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22 ) కు హైదరాబాద్ లో బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ ను 21 , 22 తేదీలను అభిమానులు ప్లాన్ చేశారు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకుంటున్న ఘరానా మొగుడు…

లైగర్ టీమ్ ఎమోషనల్
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిపోయింది ఛార్మి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరీ-ఛార్మీ ఇద్దరూ కలిసి నిర్మించారు. ఇక ఇప్పుడు లైగర్ తో వచ్చేస్తున్నారు. పూరీ-ఛార్మి నిర్మించిన ఈసినిమాలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 25న రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి సీతారామం
ఈరోజుల్లో ఒక సినిమా గట్టిగా పది రోజులు థియేటర్లలో ఆడిందంటే చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సూపర్ హిట్ అయితే తప్పా ఆ సినిమాను థియేటర్లలో ఉంచే పరిస్థితి లేదు. ఇక కరోనా వల్ల పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సినిమాలు ఆడటం సంగతి పక్కన పెడితే.. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టంగా మారింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే కొన్ని సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రాణం పోస్తున్నాయి. అలాంటి వాటిలో రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమా కూడా ఒకటి.

డబుల్ బ్లాక్ బస్టర్ బింబిసార
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న బింబిసార మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం…

చిరంజీవి , రజనీకాంత్ లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.లైగర్ మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్ మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్…

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్
డల్లాస్‌లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సెప్టెం బర్ 24న జరగనుంది. ఆ కార్నివాల్ కు సంబంధించి జెర్సీ, ట్రోఫీని చిరంజీవి పార్క్ హయాత్ హోటల్లో ఆవిష్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువ హీరోలంతా చిరంజీవితో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, తమన్, తరుణ్, ఆదర్శ్, ప్రిన్స్, ఖయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు.చిత్రపురి కాలనీలో సినీ వర్కర్స్, డైలీ వేజ్ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టిస్తున్నట్లు చిరు ప్రకటించారు.

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ రాజకుమారుడు అని అందుకే అంటారు తనను. ఇక ఈమధ్య మహేష్ ను చూస్తుంటే రోజు రోజుకి మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు తన మేకోవర్ ను మార్చుకుంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకే తన మేకోవర్ ను మార్చేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో కూడా తను ఏ పిక్ పెట్టినా కూడా అది వైరల్ గా అవుతుంది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రశంసలు
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

#SSMB28 కు పోకిరి సెంటిమెంట్
రీసెంట్ గానే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టగా తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నాడు. ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరుపుకున్నారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈగ్యాప్ లోనే ఫ్యాన్స్ ను రిలీజ్ డేట్ ఇచ్చి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఇదే రోజున పోకిరి సినిమా రిలీజ్ అయింది. పోకిరి సినిమా రిలీజ్ అయి పలు సంచలనాలు సృష్టించడంతో ఇక ఇదే రోజున మహేష్…

బిగ్ బాస్ 6 అఫీషియల్ డేట్ ఫిక్స్
బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్ వచ్చి దాదాపు మూడు నెలలు సందడి చేస్తుంది. ఇక ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈసారి కూడా కింగ్ నాగార్జుననే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈషోకి సంబంధించిన ప్రోమోలతో నాగ్ కూడా వచ్చేశాడు.

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు…

పునీత్ రాజ్ కుమార్ కు లైగర్ నివాళులు
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో తమ హీరో సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

సినీ కార్మికులకై చిరు బర్త్ డే కానుక
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా స్టార్ చిరంజీవి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ తో మెగా స్టార్ చిరంజీవి ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి. కరోనా సమయం లో పలు ఆక్సిజన్ బ్యాంక్స్ ద్వారా కరోనా బాధితులకు సేవలందించారు. కరోనా సమయం లో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించి వారిని ఆదుకున్నారు. తాజాగా చిరంజీవి తన బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్భంగా మరో మంచి పనికి నిర్ణయం తీసుకున్నారు.

బిగ్ బీ బ్లెస్సింగ్స్.. లైఫ్ టైమ్ మెమరీ..
చందూమొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కార్తికేయ2. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ద్వారక, కృష్ణుడి కంకణం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కించాడు చందూ మొండేటి. ఫైనల్ గా ఈసినిమా ఆగష్ట్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక నార్త్ లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ నార్త్ లో అస్సలు ప్రమోషన్సే పెద్దగా చేయలేదు. కానీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తోనే నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు అక్కడ వెయ్యికి…