డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో తమ హీరో సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా పూరీ లాంటి డైరెక్టర్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. విజయ్ దేవరకొండ హీరో అవ్వడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లో కూడా ఇప్పటికే పలు ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగానే బెంగళూరు వెళ్లారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో లైగర్ టీమ్ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే తో పాటు టీమ్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించి.. అతని మెమోరియల్ దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గతేడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను పలు పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: