వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.#NTR30 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (@AmitShah) August 21, 2022
It was a pleasure meeting you and having a delightful interaction @AmitShah ji. Thanks for the kind words. https://t.co/Hrn33EuRJh
— Jr NTR (@tarak9999) August 21, 2022
తెలంగాణలో టూర్ కు హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. RRRలో కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినట్లు షా ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా తారక రత్నం, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ను కలవడం చాలా ఆనందంగా ఉందనీ , ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అమిత్ జీ మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందనీ , మీ వ్యాఖ్యలకు థ్యాంక్స్ అంటూ ఎన్టీఆర్ రీ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































