సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ రాజకుమారుడు అని అందుకే అంటారు తనను. ఇక ఈమధ్య మహేష్ ను చూస్తుంటే రోజు రోజుకి మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు తన మేకోవర్ ను మార్చుకుంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకే తన మేకోవర్ ను మార్చేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో కూడా తను ఏ పిక్ పెట్టినా కూడా అది వైరల్ గా అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈఫొటో ను సతీమణి నమ్రతా తన ఇన్స్టా ద్వారా షేర్ చేశారు. ఈఫొటో స్విమ్ చేస్తున్న మహేష్ షర్ట్ లేకుండా ఉన్నారు. ఈ ఫొటోను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకూ మహేష్ ఎన్నో ఫొటోలు షేర్ చేశారు. అయితే షర్ట్ లెస్ తో మాత్రం ఇంతవరకూ మహేష్ ఫొటోని పోస్ట్ చేయలేదు. అందుకే ఈ లుక్ కు అంత రెస్పాన్స్ వస్తుంది.
View this post on Instagram
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























