
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 41


సామ్ పై స్టంట్ మాస్టర్ ప్రశంసలు

బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు

బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ సెన్సార్ పూర్తి

బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కియారా అద్వానీ

స్టార్ హీరో యష్ న్యూ లుక్

కాజల్ ఫస్ట్ హారర్ తమిళ మూవీ ఘోస్టీ టీజర్ రిలీజ్

కారు ప్రమాదానికి గురైన రంభ ఫ్యామిలీ

ప్రేమను బయటపెట్టిన తమిళ్ స్టార్స్

సమంత హెల్త్ పై మహానటి కామెంట్స్

విజయ్ 67 లో విశాల్?

పోలాండ్ లో రవితేజ ఈగిల్ ?

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార

పుష్ప 2 షూటింగ్ డేట్ ఫిక్స్

100 కోట్ల దిశగా సర్దార్

సామ్ హెల్త్ ఇష్యూ పై ఎన్టీఆర్ రియాక్షన్

రంగమార్తాండ ప్రకాష్ రాజ్-బ్రహ్మీ ల టఫ్ సీన్

గాడ్ ఫాదర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా గాడ్‌ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిపర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయి వాటన్నింటిని చేరిపేసింది. పేరుకే లూసిఫర్ రీమేక్ కానీ ఈసినిమా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

ప్రభాస్ 20 ఇయర్స్ సినీ జర్నీ సందర్భంగా వర్షం మూవీ రీరిలీజ్
ఈశ్వర్ (2002)మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ప్రభాస్ తరువాత రాఘవేంద్ర మూవీ లో నటించారు. శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా తెరకెక్కిన వర్షం మూవీ ఘనవిజయం సాధించి, 79 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి , బిల్లా , డార్లింగ్ , Mr పర్ ఫెక్ట్ , మిర్చి మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన బాహుబలి , బాహుబలి 2 మూవీస్ భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటాయి . ఈ మూవీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.

సామ్ పై స్టంట్ మాస్టర్ ప్రశంసలు
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే నటిగా తన సత్తా ఏంటో చూపించింది. ఇక అప్పటినుండి దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా రాణించింది. ఇక ఇప్పుడు మాత్రం పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. ఇందులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మట్టి కుస్తీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ హీరో విష్ణు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరణ్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రంతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో మట్టి కుస్తీ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా నుండి చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ అప్ డేట్ ను ఇచ్చారు. ఫస్ట్…

హిట్ 2 కీలక పాత్రల పోస్టర్లు రిలీజ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసీక్వెల్ అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హిట్ 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారిగా అడివి శేష్ కనిపించనున్నాడు. ఈసినిమాను మల్టీ స్టేట్స్‌లో కేసులు సాల్వ్ చేసే విధంగా హిట్ యూనివర్స్‌ను ప్లాన్ చేసినట్టు కూడా శైలేష్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటుంది.

బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా విధులు నిర్వహించారు. ఆయన పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు. ఇక ఈనేపథ్యంలో నేడు మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ సెన్సార్ పూర్తి
విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో యువ హీరో నందు, యాంకర్ రష్మీ గౌతమ్ జంటగా తెరకెక్కిన కామెడీ యాక్షన్ డ్రామా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వీర అభిమానిగా పోతురాజు పాత్రలో హీరో నందు నటించిన ఈ మూవీ లో కిరీటి దామరాజు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.

బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కియారా అద్వానీ
ఫగ్లీ(2014 ) మూవీతో కియారా అద్వానీ బాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయ్యారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవిత కథపై తెరకెక్కిన ఎం.ఎస్.ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీలో కియారా హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీతో కియారా టాలీవుడ్ కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించిన కియారా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ బ్లాక్ బస్టర్ కబీర్ సింగ్ మూవీతో స్టార్ డమ్ అందుకున్నారు.

స్టార్ హీరో యష్ న్యూ లుక్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

కాజల్ ఫస్ట్ హారర్ తమిళ మూవీ ఘోస్టీ టీజర్ రిలీజ్
కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. కాజల్ తన కుమారుడు నీల్ కిచ్లూ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

కారు ప్రమాదానికి గురైన రంభ ఫ్యామిలీ
టాలీవుడ్ నటి రంభ కారు ప్రమాదానికి గురైంది. తృటిలో ఆమె కుటుంబం ప్రమాదం నుండి తప్పించుకోగలిగింది. ఇక ఈవిషయాన్ని రంభ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.

ప్రేమను బయటపెట్టిన తమిళ్ స్టార్స్
ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఏ హీరో ఏ హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడో, ఏ హీరోయిన్ ఏ హీరోకు కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టం. కొంతమంది ప్రేమలో ఉన్నా కానీ పెళ్లి వరకూ అది కన్ఫామ్ చేయరు. అయితే ఏదో ఒక రకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా నోరు విప్పే పరిస్థితి ఉండదు. ఇక ఈమధ్య కాలంలో ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు చాలానే ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు మరో జంట బయటకు వచ్చారు. ఆ జంట ఎవరో కాదు తమిళ్ హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తిక్-మంజిమా మోహన్ ది. గత కొంతకాలంగా మంజిమా మోహన్, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ ఈవార్తలపై ఈ జంట క్లారిటీ…

సమంత హెల్త్ పై మహానటి కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే.

విజయ్ 67 లో విశాల్?
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సమీకరణాలు ఎలా మారిపోయాయో చూస్తున్నాం. హీరోలు కూడా కేవలం హీరోయిజానికి మాత్రమే కాకుండా కీలక విభిన్నమైన సినిమాలు చేయడానికి.. పాత్ర డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉదాహరణకు విక్రమ్ సినిమాలో స్టార్ హీరో సూర్య చేసింది కేవలం కొన్ని నిమిషాల వ్యవధి ఉన్న పాత్రలో మాత్రమే నటించారు. కానీ ఆ పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక చిరు ప్రధాన పాత్రలో వచ్చిన గాడ్ ఫాదర్ లో సైతం సల్మాన్ లాంటి హీరో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. స్టార్ హీరోలు సైతం వేరే సినిమాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు.

పోలాండ్ లో రవితేజ ఈగిల్ ?
యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర రావు , సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పుష్ప 2 షూటింగ్ డేట్ ఫిక్స్
మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

100 కోట్ల దిశగా సర్దార్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తి హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్…

సామ్ హెల్త్ ఇష్యూ పై ఎన్టీఆర్ రియాక్షన్
ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత హెల్తె ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి సమంత కాస్త అనారోగ్యంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్నారు చాలామంది. కానీ తాజాగా సమంత తన సోషల్ మీడియా ద్వారా తనకు ఉన్న హెల్త్ డిసీజ్ గురించి చెప్పడంతో అది నిజమే అని తెలిసింది.

రంగమార్తాండ ప్రకాష్ రాజ్-బ్రహ్మీ ల టఫ్ సీన్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఎన్నో పరాజయాల తరువాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈసినిమా మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసినిమాకు షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. అలా ఎన్నో అవాంతరాలు అందుకొని ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతంఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఒకరి తరువాత ఒకరు డబ్బింగ్ ను పూర్తిచేసుకుంటున్నారు. కృష్ణవంశీ కూడా అందుకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు…