హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌లో కాంతార నిలిచింది.టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన డబ్బింగ్ సినిమాల్లో 78 కోట్ల కలెక్షన్స్‌తో యశ్ కేజీఎఫ్-2 ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా కమల్ హాసన్ విక్రమ్ 43 కోట్ల కలెక్షన్స్ దాటుకుని కాంతార సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆ ల్ టైమ్ గా కాంతార రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార చిత్రం కర్ణాటకలోని హోంబలే ఫిల్మ్స్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. అంటే, ఈ మూవీ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా సృష్టించబడిన అత్యధిక ఫుట్‌ఫాల్స్ రికార్డ్‌ను కూడా అధిగమించింది.తాజాగా బాహుబలి-2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. బాహుబలి 2 ఐదో వారాంతంలో రూ.23.2కోట్ల వసూళ్లను రాబట్టింది. కాంతార ఐదో వారాంతంలో రూ.40.30కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. బాహుబలి 2 ని 55శాతం మార్జిన్‌తో కాంతార బీట్ చేసింది. కాంతార మూవీ అన్ని భాషలలోనూ దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: