ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే నటిగా తన సత్తా ఏంటో చూపించింది. ఇక అప్పటినుండి దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా రాణించింది. ఇక ఇప్పుడు మాత్రం పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తుంది. ఇందులో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హరి హరీష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా యశోద. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఈసినిమాలో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ పై ప్రశంసలు కురిపించాడు. ఈసినిమాకు సంబంధించిన స్టంట్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ యాక్షన్ సీక్వెన్స్ ను అందించాడు. ఈయన సమంత యాక్షన్ సీక్వెన్స్ పై స్పందిస్తూ.. సమంత చాలా డెడికేషన్ వర్క్ చేస్తుందని.. అలాంటి వారితో పనిచేయడం తనకు చాలా ఇష్టమని చెప్పారు. ప్రశంసలు గతంలో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు ఆయన వర్క్ చేశారు.
Behind the enthralling Action Sequences of #Yashoda, @YannickBen2 gives insights about @Samanthaprabhu2‘s grit & much more💥
▶️ https://t.co/HYF0w6yLj8 #Yashoda #YashodaTheMovie @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/wVUeMGudtW
— Sridevi Movies (@SrideviMovieOff) November 1, 2022
కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: