ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత హెల్తె ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి సమంత కాస్త అనారోగ్యంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్నారు చాలామంది. కానీ తాజాగా సమంత తన సోషల్ మీడియా ద్వారా తనకు ఉన్న హెల్త్ డిసీజ్ గురించి చెప్పడంతో అది నిజమే అని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీవితం ఎన్నో సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత ధైర్యాన్ని, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. గత కొన్ని నెలల నుండి నేను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండీషన్ కు చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను.. అయితే అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ టైమే పడుతుంది. త్వరలోనే దీనినుండి పూర్తిగా కోలుకుంటానని నమ్మకం ఉంది.. నా జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులు, చెడు రోజులు అన్నీ చూశాను.. ఎలాగో అలాంటి రోజులు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది ఐ లవ్ యూ అంటూ పోస్ట్ చేసింది.
ఇక సమంత కు ఇండస్ట్రీ నుండి చాలా సపోర్ట్ లభిస్తుంది. స్టార్ హీరోల దగ్గర నుండి హీరోయిన్స్ అందరూ సమంత త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ‘సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను’. అంటూ ట్వీటర్ ద్వారా భరోసా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సమంత ఎన్టీఆర్ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. వారిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
Get well soon Sam. Sending you all the strength.
— Jr NTR (@tarak9999) October 29, 2022
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























