మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా గాడ్‌ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిపర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయి వాటన్నింటిని చేరిపేసింది. పేరుకే లూసిఫర్ రీమేక్ కానీ ఈసినిమా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక ఈసినిమా నవంబర్ 19వ తేదీన ఓటీటీ లో రిలీజ్ కానుంది. మరి థియేటర్లలో చూడని వారు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: