హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ తో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా నటుడు , దర్శకుడు గా గుర్తింపు పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రిషబ్ శెట్టి ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోగానే కాదు దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టికి మంచి ట్రాక్ రికార్డు ఉండటం , టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడంతో ఆ వార్తలు నిజమని ప్రేక్షకులు నమ్ముతున్నారు. తాజాగా రిషబ్ శెట్టి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రిషబ్ మాట్లాడుతూ ..
ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే అంతకంటే కావల్సిందేముంటుంది? కాకపోతే తాను ముందుగా కథను రెడీ చేసుకుని ఆ తరువాతనే అందుకు తగిన హీరోలను సంప్రదిస్తూ ఉంటాననీ , .ఎన్టీఆర్ కి తగిన కథ సిద్ధమైనప్పుడు తప్పకుండా ఆయనను కలుస్తాననీ , ప్రస్తుతానికైతే అలాంటి కథలేవీలే తన దగ్గర లేవనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: