మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. 2023 సంక్రాంతి కానుకగా ఏజెంట్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని గతంలో వెల్లడించింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతి బరిలో కూడా రావడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణలతో పాటు తమిళ హీరో విజయ్ కూడా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇలా సీనియర్ హీరోలకు పోటీ ఇవ్వడం ఇష్టం లేక, అఖిల్ తన సినిమా ఏజెంట్ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివరాత్రి కానుకగా ఏజెంట్ సినిమాను రిలీజ్ చేస్తే, పండగ సీజన్ కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: