రంగమార్తాండ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం

prakash raj about Rangamarthanda movie, Krishna Vamsi, prakash raj, Brahmanandam, Ramya Krishnan, Rangamarthanda, Rangamarthanda Movie, Rangamarthanda Update, Rangamarthanda New Update, Rangamarthanda Latest Update, Rangamarthanda Movie Updates, Rangamarthanda Telugu Movie, Rangamarthanda Telugu Movie Latest News, Rangamarthanda Telugu Movie Live Updates, Rangamarthanda Telugu Movie New Update, Rangamarthanda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమాకు ముందు నేను దర్శకత్వం వహించాలని అనుకున్నాను, అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని అనుకున్నా. ఈసినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమా.. పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఈసినిమాలో మీరు కొత్త వ్యక్తి ని చూస్తారు అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 6 =