
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 35


ఆదిత్య 369 సీక్వెల్ కు రైటర్ గా బాలకృష్ణ

యశోద మూవీ లో వన్ విమెన్ ఆర్మీ గా సమంత

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య

పుష్ప2 ఆ అడవుల్లో భారీ యక్షన్ సీక్వెన్స్

లొకేషన్స్ వేటలో #NTR30

#NC22 న్యూ రోల్ ట్రై చేస్తున్న చైతు

కర్ణాటకలో కాంతార@ వన్ క్రోర్ టికెట్స్

#SSMB28 సెకండ్ షెడ్యూల్ కోసం ట్రైనింగ్

ప్రేమ పెళ్లే.. త్వరలోనే అమ్మాయని పరిచయం చేస్తా

ఆది టాప్ గేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప:ది రూల్ మూవీ కి నో బడ్జెట్ లిమిటేషన్స్

హిట్2 టీజర్ తొలగింపుపై క్లారిటీ

ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్

నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి సినిమాతో మంచి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్. ఎలాంటి హడావుడి లేకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా స్వాతిముత్యం లాంటి కథను ఎంచుకొని హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడే రెండో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. ప్రస్తుతం రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా టీజర్…

హిట్ 2 ఉరికే ఉరికే వీడియో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. దానికి కారణం తన నుండి వస్తున్న సినిమాలు.. తను ఎంచుకునే కథలు, పాత్రలు డిఫరెంట్ గా ఉండటమే కారణం. అందుకే వరుస విజయాలను అందుకుంటూ సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది విశ్వక్ సేన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న హిట్ 2. ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి.

ఆదిత్య 369 సీక్వెల్ కు రైటర్ గా బాలకృష్ణ
నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్‌లో కొన్ని స్పెషల్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య 369 మూవీ ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు.

యశోద మూవీ లో వన్ విమెన్ ఆర్మీ గా సమంత
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య
టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా త్వరగానే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. గత రెండేళ్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానాతో పాటు నిఖిల్, నితిన్ ఇలా చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగశౌర్య. నేడు నాగశౌర్య వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతన్నాడు. ఈ నెల 20న బెంగుళూర్ లో నాగశౌర్య వివాహం జరగనుంది. దీంతో అప్పుడే నాగశౌర్య ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఇక నాగశౌర్య పెళ్లి బయటకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు…

సల్మాన్ ఖాన్ తో బాక్సర్ నిఖత్ జరీన్ సూపర్ డ్యాన్స్
బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నిఖత్‌కు చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం.వరల్డ్ చాంపియన్‌షిప్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత, నేరుగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలవాలనేది తన కోరికని నిఖత్ గతంలో ట్వీట్ చేసింది.తాను ఎంతగానో అభిమానించే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను బాక్సర్ నిఖత్ కలుసుకున్నారు.

పుష్ప2 ఆ అడవుల్లో భారీ యక్షన్ సీక్వెన్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈసినిమా. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చి పెట్టింది. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికోసం చాలా టైమ్ నే తీసుకొని సాలిడ్ స్క్రిప్ట్ ను రెడీ చేశారు. ఇక ఇటీవలే పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌తో ఫొటోషూట్ కూడా చేసింది సుకుమార్ టీం.

ఒక్క హిట్ మూవీ తో అను ఇమ్మాన్యుయేల్ కు ఆఫర్స్ వెల్లువ
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి జపాన్ తమిళ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

లొకేషన్స్ వేటలో #NTR30
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు కామెడీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రూటు మార్చాడు. కొంతకాలంగా తనకు సరైన హిట్ లేకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తరువాత మహేష్ మహర్షి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతరువాత విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందించి..నరేష్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

#NC22 న్యూ రోల్ ట్రై చేస్తున్న చైతు
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన హీరోలు ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. వారిలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఒకరు. నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అందించగా.. థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే…

వాల్తేరు వీరయ్య , వీర సింహారెడ్డి సంక్రాంతి బరిలో తగ్గేదేలే
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కర్ణాటకలో కాంతార@ వన్ క్రోర్ టికెట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

#SSMB28 సెకండ్ షెడ్యూల్ కోసం ట్రైనింగ్
ఈఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రేమ పెళ్లే.. త్వరలోనే అమ్మాయని పరిచయం చేస్తా
తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అభినయ స్పందించి అలాంటిది ఏం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజాగా మరోసారి విశాల్ పెళ్లిపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం విశాల్ చేసిన వ్యాఖ్యలే కారణం.

ఆది టాప్ గేర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తనయుడు ఆది సాయి కుమార్. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు ఆది సాయికుమార్. ఆ తరువాత పలు సినిమాలు చేసుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే తన ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు చేయడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను…

ఈ సంవత్సరం కె అక్షరంతో టైటిల్ ఉన్న సూపర్ హిట్ మూవీస్
ఈ సంవత్సరం కె అక్షరంతో మొదలయిన టైటిల్ తో ఉన్న 4సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం.

పుష్ప:ది రూల్ మూవీ కి నో బడ్జెట్ లిమిటేషన్స్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

హిట్2 టీజర్ తొలగింపుపై క్లారిటీ
టాలీవుడ్ హీరో అడివిశేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా టీజర్ రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.

ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్
సెలబ్రిటీస్ పై నెటిజన్స్ కామెంట్స్ చేయడం వారిపై ట్రోల్స్ చేయడం కామన్ థింగే. ఇక కొంతమంది సెలబ్రిటీలు వారిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీస్ వాటికి కౌంటర్ లు ఇవ్వడం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.