ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సామాన్య స్థితికి వస్తున్నాయి.. ప్రజలు కూడా కాస్త భయం పోయి బయట తిరుగుతున్నారు.. అయితే కరోనా మాత్రం అప్పుడప్పుడు నేనున్నాని ఇంకా గుర్తుచేస్తూనే ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి.. ఇంట్లో నుండి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. పస్తులతో ఉన్నారు.. ఈ సమయంలోనే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా పరిశ్రమ కూడా కరోనా వల్ల చాలా నష్టపోయింది. ఎన్నో సినిమాల షూటింగ్ లు ఆగిపోవడం.. రిలీజ్ లు ఆగిపోవడంతో పాటు ఎంతో మంది ప్రాణాలను బలిగొంది ఈ మహమ్మారి. ఎంతో మంది హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడినవారు ఉన్నారు. ఇప్పడు కరోనా ప్రభావం చాలా వరకూ తగ్గింది అనుకుంటుండగా మరో స్టార్ హీరోకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. సూర్య. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నాు. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని అందరూ గ్రహించాలి. భద్రత మరియు శ్రద్ధ అవసరం. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు’’ అని సూర్య ట్వీట్ చేశారు.
’கொரோனா’ பாதிப்பு ஏற்பட்டு, சிகிச்சை பெற்று நலமுடன் இருக்கிறேன். வாழ்க்கை இன்னும் இயல்பு நிலைக்கு திரும்பவில்லை என்பதை அனைவரும் உணர்வோம். அச்சத்துடன் முடங்கிவிட முடியாது. அதேநேரம் பாதுகாப்பும், கவனமும் அவசியம். அர்ப்பணிப்புடன் துணைநிற்கும் மருத்துவர்களுக்கு அன்பும், நன்றிகளும்.
— Suriya Sivakumar (@Suriya_offl) February 7, 2021
కాగా గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు సూర్య. అంతేకాదు ఈ ఏడాది మన దేశం తరపున ఆస్కార్‌కు ఎన్నికైన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చోటు దక్కించుకుంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























