ప్రభాస్ ‘మిర్చి’కి 8 ఏళ్లు

Rebel Star Prabhas Mirchi Completes 8 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Mirchi,Mirchi Movie,Mirchi Movie Telugu,Mirchi Telugu Movie,Mirchi Updates,Mirchi Movie Latest News,Mirchi Movie Songs,Mirchi Songs,Mirchi Movie Scenes,Prabhas Mirchi,Mirchi Prabhas,Prabhas Starrer Mirchi,Mirchi Telugu Full Movie,Mirchi Movie Prabhas Action Scene,8 Years For Mirchi,Director Koratala Siva,Anushka Shetty,8 years of Mirchi,Prabhas Mirchi 8 Years,#8YearsForMirchi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో ‘మిర్చి’ ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో… శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన డైలాగ్ ప్రభాస్ కు సరిగ్గా సూటవుతుంది. ప్రభాస్ కటౌట్ అలా ఉంటుంది మరి. కొరటాల శివ ప్రభాస్ కు తగ్గ డైలాగ్ ను అప్పుడే రాసుకున్నాడు. కొరటాల శివ-ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మిర్చి. అప్పటివరకూ ఉన్న ప్రభాస్ కు ఈ సినిమాలో కనిపించిన ప్రభాస్ కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక రకంగా ఆ క్రెడిట్ డైరెక్టర్ కొరటాలకే చెందుతుంది అని చెప్పొచ్చు. ప్రభాస్ మేకోవర్ మొత్తం మార్చేశాడు. మంచి స్టైలిష్ లుక్ తో చూపించడమే కాదు అందుకు తగ్గ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్నీ కలిసి ఒక మంచి పవర్ ఫుల్ ప్యాక్డ్ సినిమాను అందించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.

ఇక 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమా నేటితో 8ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా మారిన కొరటాల శివ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేసింది. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా పలు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు.. ఇలా పలు విభాగాల్లో ‘మిర్చి’ ‘నంది’ పురస్కారాలను పొందింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.