‘నిన్నిలా నిన్నిలా’ ట్రైల‌ర్ రిలీజ్

Supreme Hero Sai Dharam Tej Released Ninnila Ninnila Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sai Dharam Tej,Ninnila Ninnila,Ashok Selvan,Ritu Varma,Nithya Menen,Nasser,Sathya,Zee Plex,Ninnila Ninnila on 26th Feb,Ninnila Ninnila Movie,Ninnila Ninnila Film,Ninnila Ninnila Telugu Movie,Ninnila Ninnila Telugu Movie Triler,Ninnila Ninnila Movie Trailer,Ninnila Ninnila Trailer,Ninnila Ninnila Official Trailer,Ninnila Ninnila Trailer Out,Ninnila Ninnila Movie Trailer Released,Ninnila Ninnila Movie Trailer Unveiled,Ninnila Ninnila Movie Trailer Telugu

మలయాళ దర్శకుడు దివంగత ఐవీ శశి తనయుడు అనీ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరు ‘నిన్నిలా నిన్నిలా’. ప్రముఖ తమిళ నటుడు, ‘పిజ్జా 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్ విడుద‌ల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మెగా హీరో సాయి తేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే.. కామెడీ, ఎమోష‌న్స్‌, ల‌వ్ అన్నీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో అశోక్ సెల్వన్ చెఫ్ పాత్రను పోషిస్తున్నాడు.

కాగా బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లండన్ నేపథ్యంలో జరిగిన థ్రిల్లర్ సినిమా కావడంతో.. అక్కడే షూటింగ్ మొత్తం జరుపుకున్నట్టు తెలుస్తుంది. నాజర్ సత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా.. నేరుగా ఫిబ్రవరి 26 ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.