‘సర్కారు వారి పాట’ లొకేషన్స్ కు మహేష్ ఫిదా

Superstar Mahesh Babu Shares Pic of Sarkaru Vaari Paata Movie Shooting Location,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Superstar Mahesh Babu,Mahesh Babu,Hero Mahesh Babu,Actor Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari PaataMovie Updates,Sarkaru Vaari Paata Movie Latest News,Sarkaru Vaari Paata Movie Shooting,Sarkaru Vaari Paata Movie Shooting Location,Mahesh Babu Shoots For Sarkaru Vaari Paata In Sharjah Mleiha,Sarkaru Vaari Paata Shoot In Sharjah,Sarkaru Vaari Paata In Sharjah Mleiha

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. ఇక అక్కడి షూటింగ్ కు సంబంధించి పలు ఫొటోలు.. లొకేషన్స్ కు సంబందించిన ఫొటోలు ఇప్పటికే మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా అవి వైరల్ అవుతున్నాయనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా అక్కడి లొకేషన్ కు సంబంధించి మరో ఫొటో పోస్ట్ చేసాడు. తాజాగా షార్జాకు సమీపంలో ఉన్న మ్లైహాలో ఎడారి లో షూట్ జరుగుతుండగా ఆ ప్రాంతం అద్భుతమైన అనుభూతి కలిగిస్తోందని… ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్భుతమైన లొకేషన్లు బాగా నచ్చాయి. ఇక్కడి అతిథ్యం, ప్రేమ గొప్పగా ఉన్నాయ`ని మహేష్ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + two =