కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు ఈ ఏడాదికి షిఫ్ట్ అయిపోయాయి. అందుకే షూటింగ్ అయిపోయిన సినిమాలు..అవ్వని సినిమాలు.. షూటింగ్ మొదలుకాని సినిమాలు ఇలా చాలా వరకు ముందుగానే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40కి పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఈఏడాది మొత్తం మెగా హీరోల హవానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ నుండే దాదాపు అరడజను సినిమాలకు పైగా రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు కాదు దాదాపు 10 మంది హీరోలున్నారు. అందులో సగం మంది హీరోలైనా కనీసం ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తుంటారు. కానీ 2021 మాత్రం మెగాభిమానులకు చాలా ప్రత్యేకం. ముందుగా ఈ నెల 12న వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, మే 13న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, జూన్ 4న సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రిపబ్లిక్’, జులై 30న వరుణ్ తేజ్ ‘గని’, ఆగస్ట్ 13న అల్లు అర్జున్ ‘పుష్ప’, ఆగష్ట్ 27న వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్-3’, అక్టోబర్ 13న ఎన్టీఆర్ తో కలసి చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇంకా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. సినిమాలు కూడా ఉన్నాయి.. ఇంకా అల్లు శిరీష్ కొత్త సినిమా మొదలుపెట్టలేదు.. ఒకవేళ మొదలుపెడితే ఈ ఏడాదే మ్యాగ్జిమమ్ రిలీజ్ అవుతుంది. వాటితోపాటు పవన్ చేసే అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.
మరి చూడబోతే టాలీవుడ్ మెగా మానియా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క కుటుంబం నుండి ఇన్ని సినిమాలు రావడమంటే చిన్న విషయం కాదు. అంతేకాదు వీటిలో దాదాపు అన్ని సినిమాలు పెద్దవే. ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో.. ఎన్ని ఫట్ అవుతాయో చూద్దాం. హిట్ ఫట్ సంగతి పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం పండగే పండగ.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: