రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సిన వచ్చింది. నిజానికి ఈడేట్ న టక్ జగదీష్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే టక్ జగదీష్ సినిమా వాయిదా పడటంతో ఈసినిమాను రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అసలే బాలేవు.. దానికి తోడు థియేటర్లు కూడా బంద్ అవడంతో ఈసినిమా రిలీజ్ కూాాడా వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం.. పరిస్థితులు బాలేకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నామని.. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.
With an alarming rise in #Covid19 cases, keeping public safety in mind, we have decided to postpone our theatrical release of #ISHQ.
We will release the film when the time is right; we request everyone to be safe. We are all in this together. #RBChoudary @ProducerNVP #ParasJain— Megaa Super Good Films (@MegaaSuperGood) April 20, 2021
కాగా ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈసినిమాను ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: