ఖిలాడి డైరెక్టర్ కు కరోనా.. షూట్ కు బ్రేక్

Khiladi Movie Shoot Gets A Break As The Movie Director Tests Positive For Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja’s Khiladi,Ravi Teja’s Khiladi Movie,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Update,Khiladi Update,Khiladi Film Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,Khiladi Movie Latest News,Khiladi Movie Shooting,Khiladi Movie Shooting Update,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja Khiladi,Khiladi Movie Shooting Halted,Khiladi Shooting Halted,Ravi Teja Khiladi Shooting Halted,Director Ramesh Varma Tested Positive,Ramesh Varma,Director Ramesh Varma,Director Ramesh Varma Tested Positive For COVID-19,Ramesh Varma Tested Positive For Coronavirus,Khiladi Movie Shoot

క‌రోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ను మ‌రోసారి షేక్ చేస్తోంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే సినిమా విడుద‌ల తేదీలు మార్చేసుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. షూటింగ్స్ కూడా ర‌ద్దు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. అంద‌రు మాస్క్ ధ‌రించాలి. అత్య‌వ‌స‌రాల‌కు మిన‌హాయించి బ‌య‌ట తిర‌గ‌డం మానేయాలంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమాను మే 28న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =