కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. మునుపటి కంటే చాలా తొందరగా కరోనా సోకుతుండటంతో అందరూ భయపడుతున్నారు. ఇక సినీ పరిశ్రమపై దీని ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.. చాలా మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. మరోవైపు చాలా చోట్ల లాక్ డౌన్ కూడా విధించారు. థియేటర్లు కూడా మూసేశారు. కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్లు ఇంకా ఓపెన్ అయి ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఏపీలో ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గిస్తూ జీవో జారీ చేయగా.. తాజాగా మరో షాకిచ్చింది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి థియేటర్లలోని అన్ని సినిమా హాళ్ళలో 50శాతం ఆక్యుపెన్సీని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫంక్షన్ హాల్స్ లో ప్రతి ఒక్కరి నడుమ 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
మరోవైపు తెలంగాణలో ఇంకా ఆక్యుపెన్సీ కూడా అయితే ఎలాంటి సమాచారంలేదు కానీ థియేటర్లను మాత్రం రాత్రి 8గంటలకు క్లోజ్ చేయాలని మాత్రం ఆదేశించినట్టు తెలుస్తుంది. మరి కేసీఆర్ కూడా ఆక్యుపెన్సీ పై నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. అలా అయితే మరోసారి తెలుగు సినిమాలకు నష్టం వాటిల్లినట్టే. ఇప్పటికే ఆ ప్రభావం వకీల్ సాబ్ సినిమాపై చూస్తూనే ఉన్నాం. సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులు వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈసినిమా ఇప్పుడు వసూళ్లు చాలా తగ్గిపోయాయి. మరి ఈఏడాది అయినా సినిమాల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: