వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు

Supreme Court Ex Judge Applauds The Team Of Vakeel Saab Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ex Supreme Court Chief Justice,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Latest Film Updates,Pawan Kalyan Updates,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel SaabTelugu Movie,Vakeel Saab Movie Update,Vakeel Saab Movie News News,V Gopala Gowda,V Gopala Gowda Heaps Praises on Pawan Kalyan,Gopala Gowda Praises on Pawan Kalyan,Gopala Gowda on Pawan Kalyan,Gopala Gowda About Pawan Kalyan,Gopala Gowda Praised Pawan Kalyan,Ex Supreme Court Chief Justice V Gopala Gowda,Block Buster Vakeel Saab,Sriram Venu,Ex Chief Justice Gopala Gowda Latest News,#VakeelSaab

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో లాయర్ గా పవన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. ఇప్పటివరకూ ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్‌ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా టైమ్. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో పడ్డారు ప్రేక్షకులు. దీనితో కలెక్షన్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మహిళా ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు పవన్ నటనకు గాను ఏకంగా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ కూడా ప్రశంసించారు. సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక ఇతిహాసం లేదా కల్పిత కథల నేపథ్యంలో వస్తాయి.. దేవదాస్ చిత్రం పవిత్ర ప్రేమను.. స్త్రీ, పురుషుల సంబంధాన్ని ఒక నూతన కోణంలో చూపించింది.. అందుకే అది భారతదేశంలో ఇప్పటికీ ఒకఅత్యుత్తమ కావ్యంగా నిలిచిపోయింది.. ఇన్నాళ్లకు వకీల్ సాబ్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాటం ఒక చిత్రంగా వచ్చింది. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా పవన్ నటన అద్భుతం.. పవన్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరు ఇలాంటి సినిమా చెయ్యరు అని కానీ పవన్ ఈ సినిమాను చేసి నటించడం కాదు జీవించేశారని ప్రశంసించారు.

మరి ప్రస్తుతం ఇంకో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న వీరమల్లు పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కే ఓరేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్.. ఇంకా హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =