
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 38


విజయ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుక్కూ

హీరో నాగార్జున మూవీ కి స్పెషల్ సెట్

మహేష్-రాజమౌళి బ్యాక్ డ్రాప్ పై నిర్మాత క్లారిటీ

పవన్ కళ్యాణ్ పై స్టార్ రైటర్ ప్రశంసలు

ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్

లావణ్య త్రిపాఠి వర్కౌట్ సెల్ఫీ

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!

విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ లో రెండు సినిమాలు

కీర్తి సురేష్ పాక శాస్త్రం

గాన గంధర్వుడు బాలు కు స్వర నీరాజనం

"మాస్ట్రో " మూవీ అప్ డేట్

'ఏక్ మినీ కథ' హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్స్

ఆది పురుష్ కోసం నన్ను ఎవరూ అడగలేదు

పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు

"మహానటి " మూవీ జ్ఞాపకాలలో కీర్తి సురేష్

తెలుగు , తమిళ మూవీస్ లో రెజీనా బిజీ

ప్రియాంక జవాల్కర్ శారీ లుక్

అందాల "చందమామ "

సాయి పల్లవి సినీ కెరీర్ లో 6 సంవత్సరాలు పూర్తి
బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన డాక్టర్ సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలంగాణ యువతి గా సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

విజయ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుక్కూ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు కూడా. అయితే కరోనా వల్ల అని సినిమాల్లాగే ఈసినిమా కూడా పెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఇక ఈగ్యాప్ లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలపై అప్పుడే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలని, విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని చిత్రనిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ప్రకటించింది.

హీరో నాగార్జున మూవీ కి స్పెషల్ సెట్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. దేశ రక్షణ కై ఎంతటి సాహసానికైనా సిద్ధపడే గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం.

మహేష్-రాజమౌళి బ్యాక్ డ్రాప్ పై నిర్మాత క్లారిటీ
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంతో మంది ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో రాజమౌళి ఇప్పటికే రెండు మూడు సినిమాలను తీశాడు. కానీ మహేష్ బాబుతో మాత్రం ఎందుకో ఇంతవరకూ సినిమా తీయలేదు. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ నుండి సినిమా రాబోతుంది. అందులో నో డౌట్.. అయితే ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం చెప్పడం కష్టం కానీ సినిమా అయితే ఉంది. ఇక మరి కాంబినేషన్ సెట్ అయిన తరువాత వార్తలకు కొదువ ఏముంటుంది. కొత్త కొత్త వార్తలన్నీ తెరపైకి వచ్చేస్తుంటాయి. అలానే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమా…

పవన్ కళ్యాణ్ పై స్టార్ రైటర్ ప్రశంసలు
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో నాగార్జున హీరోగా రూపొందిన "రాజన్న "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పిన "బాహుబలి "మూవీ కి కథ ను అందించిన ఘనత విజయేంద్ర ప్రసాద్ దే. సల్మాన్ ఖాన్ "భజరంగి భాయి జాన్ ", కంగనా రనౌత్ "మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ "బాలీవుడ్ మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. "తలైవి "(తమిళ ),"రౌద్రం రణం రుధిరం " మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు.

ఫ్యాక్షన్ లీడర్ గా హీరో రామ్
సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

లావణ్య త్రిపాఠి వర్కౌట్ సెల్ఫీ
క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం, అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.

ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!
ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో ఎంతో మంది హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ లో రెండు సినిమాలు
సక్సెస్ ఫుల్ “నువ్విలా “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన “పెళ్ళిచూపులు “మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ “గీత గోవిందం “, “టాక్సీవాలా “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…

కీర్తి సురేష్ పాక శాస్త్రం
తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ గ్రహీత , టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

గాన గంధర్వుడు బాలు కు స్వర నీరాజనం
"శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న "(1966 ) మూవీ తో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు తెర కు సింగర్ గా పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా 40, 000 సాంగ్స్ కు గళం అందించి బాలు తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 6 నేషనల్ , 25 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను బాలు అందుకున్నారు. ఒక్క రోజు లో తమిళ భాష లో 19 సాంగ్స్ , హిందీ భాషలో 16 సాంగ్స్ గానం చేసిన ఘనత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం దే. ప్లే బ్యాక్ సింగర్ , టెలివిజన్ ప్రెజెంటర్ , యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కళామతల్లి కి సేవలందించిన బాలు ను పద్మశ్రీ , పద్మ భూషణ్…

"మాస్ట్రో " మూవీ అప్ డేట్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'ఏక్ మినీ కథ' హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్స్
పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారినా ఏక్ మినీ కథ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు సంతోష్ శోభన్. బోల్డ్ కంటెంట్ తో ఉన్నఈసినిమాకు మొదటినుండి మంచి బజ్ ఏ ఉంది. అలానే ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా సపోర్ట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలను బాగా రీచ్ అయింది కూడా ఈసినిమా. అమెజాన్ లో మే 27న రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

ఆది పురుష్ కోసం నన్ను ఎవరూ అడగలేదు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. అయితే ముంబైలో ఇక్కడే షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలోరూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30వ తేదీరిలీజ్ కానుంది. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

"మహానటి " మూవీ జ్ఞాపకాలలో కీర్తి సురేష్
తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

తెలుగు , తమిళ మూవీస్ లో రెజీనా బిజీ
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. రెజీనా ప్రస్తుతం "పార్టీ","కళ్ళపార్టు ", "కాసాడ తపరా"(తమిళ ), తెలుగు , తమిళ భాషల "శూర్పాంగనై" మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

ప్రియాంక జవాల్కర్ శారీ లుక్
"కలవరం ఆయే "మూవీ తో మోడల్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ "టాక్సీవాలా "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న "తిమ్మరుసు "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

అందాల "చందమామ "
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి "ఆచార్య “ నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), మామల హాసన్ “ఇండియన్ 2 “, దుల్కర్ సల్మాన్ “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో కాజల్ అగర్వాల్ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.