“శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న “(1966 ) మూవీ తో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు తెర కు సింగర్ గా పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా 40, 000 సాంగ్స్ కు గళం అందించి బాలు తన గాన మాధుర్యం తో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా 6 నేషనల్ , 25 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను బాలు అందుకున్నారు. ఒక్క రోజు లో తమిళ భాష లో 19 సాంగ్స్ , హిందీ భాషలో 16 సాంగ్స్ గానం చేసిన ఘనత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం దే. ప్లే బ్యాక్ సింగర్ , టెలివిజన్ ప్రెజెంటర్ , యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కళామతల్లి కి సేవలందించిన బాలు ను పద్మశ్రీ , పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ వంటి పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ బాలు జయంతికి ఘన నివాళులు అర్పించేందుకు తెలుగు చిత్రసీమ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ వేదికగా ఉదయం పది నుంచి రాత్రి పది వరకూ పన్నెండు గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ బాలు గారి జయంతిని పురస్కరించుకుని జూన్ 4ను ఆయనకు అంకితం చేయాలని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా నిర్ణయించుకున్నారనీ , లైవ్లో సినీ ప్రముఖులు అందరూ పాల్గొని బాలుగారి సేవలను స్మరించుకుంటారనీ చెప్పారు. సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ ‘‘బాలుగారి 75వ జయంతి సందర్భంగా భారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నామనీ , నటీనటులు, దర్శక, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























