ఆది పురుష్ కోసం నన్ను ఎవరూ అడగలేదు

Bollywood Actor Siddharth Shukla Denies Rumors Of Being Approached For A Role In Adipurush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sidharth Shukla Not In Prabhas Kriti Sanon's Adipurush,Sidharth Shukla BNot Approached For Prabhas Adipurush,Sidharth Shukla Confirms He Hasn’t Been Approached For Adipurush,Actor Siddharth Shukla,Siddharth Shukla,Siddharth Shukla News,Siddharth Shukla Latets News,Sidharth Shukla Clarifies He Has Not Been Approached For Adipurush,Sidharth Shukla Confirms He Hasn't Been Approached For Adipurush,Siddharth Shukla Not In Adipurush,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Updates,Adipurush Movie News,Prabhas Adipurush,Kriti Sanon,Prabhas,Rebel Star Prabhas,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Siddharth Shukla About Adipurush,Siddharth Shukla About His Role In Adipurush,#Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా  కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. అయితే ముంబైలో ఇక్కడే షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో మరో కీలక పాత్రలో బిగ్ బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా ను తీసుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈవార్తలపై స్పందించిన సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఆదిపురుష్’ సినిమా కోసం నన్ను ఎవరు సంప్రదించలేదని..ఇవన్నీ వట్టి రూమర్స్ అని తెలిపిన ఆయన దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉన్నా నేనే స్వయంగా వెల్లడిస్తాని తెలిపాడు. దీనితో ఈవార్తలకు బ్రేక్ పడింది.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =