
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 36


రీతూ వర్మ స్ట్రాటజీ

మోడలింగ్ డేస్ లో సోనూసూద్

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్

ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి

ముగింపు దశలో "మేజర్ "

'ఫలక్ నుమా దాస్ 2' అనౌన్స్ చేసిన విశ్వక్

నాని చేతుల మీదుగా '777 చార్లి' టీజర్ రిలీజ్

జూలై లో "విరాటపర్వం" రిలీజ్ ?

స్టార్ హీరోలతో నటించాలని ఉంది - కావ్య థాపర్

ఆగస్ట్ లో సెట్స్ పైకి "#PSPK 28 "

నేను టాప్ స్టార్స్ ను సెలక్ట్ చేసుకోను

'విరాటపర్వం' ఎమోషనల్ లవ్ స్టోరీ

మణిరత్నం "పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్

అభిమానులకు రామ్ చరణ్ థ్యాంక్స్

టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి

నటనకు పరిమితులు లేవు - కావ్య థాపర్

పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రకుల్ ప్రీత్

సినీ కార్మికులకు వ్యాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : మెగాస్టార్ చిరంజీవి
కోరనా వల్ల సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే జరిగింది. షూటింగ్ లు లేకపోవడం.. థియేటర్లు మూత పడటం.. బిజినెస్ ఆగిపోవడం వల్ల కొన్నివేల కోట్లలో నష్టం వచ్చింది.పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఎంతో మంది సినీ కార్మికులు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వారికోసం ఎంతో మంది సినీ పెద్దలు ముందుకొచ్చి నిత్యవసరాలు అందించారు. ఆర్థికంగా సహాయ పడ్డారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయపడ్డారు. ఇక ఇప్పుడు ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో…

రీతూ వర్మ స్ట్రాటజీ
సూపర్ హిట్ "బాద్ షా" మూవీ తో నటిగా కెరీర్ ప్రారంభించిన రీతూవర్మ సక్సెస్ ఫుల్ "ప్రేమ ఇష్క్ కాదల్" మూవీ తో కథానాయికగా మారారు.బ్లాక్ బస్టర్ "పెళ్ళిచూపులు " మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. రీతూవర్మ కథానాయికగా రూపొందిన "టక్ జగదీష్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మోడలింగ్ డేస్ లో సోనూసూద్
1997 సంవత్సరం లో ముంబై చేరుకొని మోడలింగ్ చేసిన సోనూ సూద్ "కలైంజర్ " (1999) తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 'హ్యాండ్స్ అప్ "(2000) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "షహీద్ ఈ అజాం "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సోనూసూద్ విలన్ , కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోనూసూద్ బ్లాక్ బస్టర్ “అరుంధతి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “తమిళరసన్ “(తమిళ ), “పృథ్విరాజ్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

అభిమానులకు 'బాలయ్య' రిక్వెస్ట్
జూన్ 10వ తేదీన నందమూరి బాలయ్య పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అభిమానులు ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల గత ఏడాది తమ అభిమానులకు పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండమని ఎలా చెబుతున్నారో.. ఈఏడాది కూడా అలాగే తమ అభిమానులను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ కూడా సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు.

ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.

ముగింపు దశలో "మేజర్ "
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న అడివి శేష్ కథానాయకుడిగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు.

'ఫలక్ నుమా దాస్ 2' అనౌన్స్ చేసిన విశ్వక్
ఫలక్ నుమా దాస్ సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ ను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఈసినిమా హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

నాని చేతుల మీదుగా '777 చార్లి' టీజర్ రిలీజ్
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి.

జూలై లో "విరాటపర్వం" రిలీజ్ ?
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. 90 ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

స్టార్ హీరోలతో నటించాలని ఉంది - కావ్య థాపర్
“ఈ మాయ పేరేమిటో “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కావ్య థాపర్ “మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్”మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ “ఏక్ మినీ కథ “మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కావ్య యాక్టింగ్ స్కిల్స్ చూసిన పలువురు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో నటించాలని సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన 'గుడ్ లక్ సఖి' మేకర్స్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో చిన్న సినిమాలు దాదాపు ఓటీటీలో రిలీజ్ కే చూస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కాస్త లేట్ అయినా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఇక ‘గుడ్ లక్ సఖి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆగస్ట్ లో సెట్స్ పైకి "#PSPK 28 "
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ దర్శకత్వంలో "#PSPK 28 " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన“గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

నేను టాప్ స్టార్స్ ను సెలక్ట్ చేసుకోను
కొంతమందికి లక్ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో తెలియదు. అలా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా తీసి సంచలన విజయం దక్కించుకున్నాడు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది కదా ఇంకెవరూ.. కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో దేశం మొత్తానికి ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ నీల్. బడా హీరోలు సైతం ప్రశాంత్ దర్శకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

'విరాటపర్వం' ఎమోషనల్ లవ్ స్టోరీ
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విరాటపర్వం' ( "రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్" అనేది ట్యాగ్‌లైన్). డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈసినిమా ఏప్రిల్ 30న విడుదల అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

మణిరత్నం "పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ "తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా రూపొందుతున్న ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష లతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

అభిమానులకు రామ్ చరణ్ థ్యాంక్స్
గత ఏడాది నుండి కరోనా అందరినీ చాలా ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక స్టార్ హీరోల అభిమానుల కూడా తమ హీరోల పేరుమీద చాలా మందికి సాయం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి.. నిత్యవసరాలకు కూడా ఇబ్బందిపడేవారికి ఇలా చాలామందికి.. బయటకు వచ్చి మరీ సాయం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ తన ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతున్నాడు.

టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి
కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్ లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటుంది తెలుగుమ్మాయి హీరోయిన్ అంజలి. నిజానికి అవ్వడానికి మనది తెలుగు ఇండస్ట్రీ అయినా ఇక్కడ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణిస్తుంది మాత్రం చాలా తక్కువనే. కాస్త ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు కూాడా సినీ ప్రపంచంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ముందు తమిళ్ సినిమాల్లో నటించిన తరువాత తెలుగు తెరకు పరిచయమైంది అంజలి. ఇక ఇక్కడ పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త కొత్త…

నటనకు పరిమితులు లేవు - కావ్య థాపర్
"తత్కాల్ "షార్ట్ ఫిల్మ్ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి కావ్య థాపర్ "ఈ మాయ పేరేమిటో "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్"మూవీ తో కావ్య కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ "ఏక్ మినీ కథ "మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మరో బాలీవుడ్ మూవీ కి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్
“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు కాజల్ అగర్వాల్ కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చందమామ “మూవీ తో కాజల్ గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “మగధీర ” మూవీ కాజల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్…

పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా "డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.