సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న అడివి శేష్ కథానాయకుడిగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా “మేజర్“మూవీ టీజర్ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు , హిందీ , మలయాళ భాషల టీజర్ విశేష ప్రేక్షకాదరణ తో భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చని కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పుడే అనుకున్నామనీ , ఎందుకంటే చిత్ర బృందంలో చాలామంది కొవిడ్ బారిన పడ్డారనీ , మిలటరీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపేందుకూ ఈ సమయంలో అనుమతి లభించలేదనీ , దాంతో వాయిదా పడే అవకాశాలున్నాయని భావించామనీ , ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ తీవ్రత వల్ల ఎలాగూ వాయిదా వేయాల్సి వచ్చిందనీ , . సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందనీ , 10 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ హీరో అడివి శేష్ తెలిపారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ “మేజర్ ” మూవీ పై అంచనాలు పెంచాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.