ఫలక్ నుమా దాస్ సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ ను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఈసినిమా హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. ఈసందర్భంగా విశ్వక్ సేస్ ఈసినిమా మూహ్తూర్తపు సన్నివేశానికి సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు త్వరలో ఫలక్ నుమా దాస్ 2 తో టీమ్ కలవబోతుందని పార్ట్ 2 కూడా ఉండబోతుందని చెప్పేశాడు.
View this post on Instagram
ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు విద్యా సాగర్ దర్శకత్వంలో ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు, ఇ. సుధీర్ నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: