టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి

Actress Anjali Makes An Interesting Revelation About Film Opportunities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Anjali,Anjali Latest News,Anjali New Movie News,Anjali Next Project News,Anjali Upcoming Film News,Anjali New Movie Details On Cards

కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్‌ లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటుంది తెలుగుమ్మాయి హీరోయిన్ అంజలి. నిజానికి అవ్వడానికి మనది తెలుగు ఇండస్ట్రీ అయినా ఇక్కడ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణిస్తుంది మాత్రం చాలా తక్కువనే. కాస్త ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు కూాడా సినీ ప్రపంచంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ముందు తమిళ్ సినిమాల్లో నటించిన తరువాత తెలుగు తెరకు పరిచయమైంది అంజలి. ఇక ఇక్కడ పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ రావడంతో అవకాశాలు కాస్త తగ్గాయి. చాలా గ్యాప్ తరువాత ఇటీవలే వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఇక ఈసినిమా మంచి హిట్ అవ్వడమే కాకుండా తనకు కూడా మంచి పేరే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి… అవకాశాలు తగ్గడంపై వస్తున్న వార్తలపై ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే టాలెంట్‌ ఉండాలి… నీకు టాలెంట్‌ ఉంటే.. అవకావాలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి.. కొత్త హీరోయిన్స్ రావ‌డం వ‌ల‌న పాత‌వారికి ఆఫర్స్ త‌గ్గుతాయ‌ని నేను అనుకోను.. పాత్ర‌కు ఎవ‌రు స‌రిగ్గా సెట్ అవుతారో మేక‌ర్స్ వారినే ఎంచుకుంటారు. ఒక‌రి ఆఫ‌ర్స్ మ‌రొక‌రు లాక్కునే అవ‌కాశం ఉండ‌దు. వేరే వారి పాత్ర‌ను నేను చేస్తే బాగుండేది అని ఎప్పుడు అనుకోను. వ‌చ్చిన ఆఫ‌ర్స్‌కి పూర్తి న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాను అని అంజ‌లి పేర్కొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 2 =