స్టార్ హీరోలతో నటించాలని ఉంది – కావ్య థాపర్

Ek Mini Katha Movie Fame Actress Kavya Thapar Express Her Interest Of Working With Big Stars

“ఈ మాయ పేరేమిటో “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కావ్య థాపర్ “మార్కెట్ రాజా ఎమ్ బి బి ఎస్”మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. సక్సెస్ ఫుల్ “ఏక్ మినీ కథ “మూవీ లో కావ్య తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కావ్య యాక్టింగ్ స్కిల్స్ చూసిన ప‌లువురు ఫిల్మ్ మేక‌ర్స్ త‌మ సినిమాల్లో న‌టించాల‌ని సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కావ్య థాపర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తెలుగు పరిశ్రమ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయనీ , , కథలు వింటున్నాననీ , తాను నటించే మూవీస్ ను త్వరలోనే కన్ఫర్మ్‌ చేస్తాననీ , సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తాననీ చెప్పారు. ప్రస్తుతం తాను తెలుగు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత అలరించేందుకు తెలుగు నేర్చుకుంటున్నా ననీ , చిరంజీవి, ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్ట‌మ‌నీ , త‌న‌కు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్, నాని తో క‌లిసి నటించాల‌ని ఉంద‌నీ కావ్య చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here