మరో బాలీవుడ్ మూవీ కి కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్

Actress Kajal Aggarwal Gives Green Signal To Another Bollywood Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Upcoming Movie News,Kajal Aggarwal Next Project News,Kajal Aggarwal Latest Film Details,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal New Film Details

“లక్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు కాజల్ అగర్వాల్ కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “చందమామ “మూవీ తో కాజల్ గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “మగధీర ” మూవీ కాజల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ఒక ప్రయోగాత్మక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవిషేక్‌ ఘోష్‌, మంత్రారాజ్‌ పలివాల్‌ నిర్మాతలుగా తథాగథ సింఘా దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రాజవంశానికి చెందిన కుటుంబంలో జరిగే వివాహ వేడుక నేపథ్యంలో “ఉమ” ప్రయోగాత్మక మూవీ తెరకెక్కనుంది. నటనపరంగా చాలెంజింగ్‌గా , ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథలకు తాను ప్రాముఖ్యతనిస్తాననీ , ‘ఉమ’ ఆ కోవకు చెందిన సినిమాయేనని కాజల్‌ అగర్వాల్‌ తెలిపారు.
సింగిల్ షూటింగ్ షెడ్యూల్ తెరకెక్కే ఈమూవీ రెగ్యులర్ షూటింగ్‌ను కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగానే మొదలుపెడతామనీ ,సెట్స్‌లో అడుగుపెట్టడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్‌ వెల్లడించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =