సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. 90 ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “విరాటపర్వం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రానా పాత్ర తర్వాత కథలో ఉన్న శక్తివంతమైన పాత్రలన్నీ మహిళలవే. ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం తో “విరాటపర్వం” మూవీని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కూడా క్రమంగా కంట్రోల్ లోకి వస్తున్న కారణంగా జూలై నెలలో “విరాటపర్వం” మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: