గత ఏడాది నుండి కరోనా అందరినీ చాలా ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక స్టార్ హీరోల అభిమానుల కూడా తమ హీరోల పేరుమీద చాలా మందికి సాయం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి.. నిత్యవసరాలకు కూడా ఇబ్బందిపడేవారికి ఇలా చాలామందికి.. బయటకు వచ్చి మరీ సాయం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ తన ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాండమిక్ టైమ్ లో బయటకు వచ్చి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సమాజానికి సాయం చేస్తున్నారు.. నేను ప్రతి ఒక్కటీ చూస్తూనే ఉన్నాను.. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
View this post on Instagram
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో కనిపించనున్నారు. మరి కొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో దశలో ఉంది. ఫస్ట్ టైమ్ చిరుతో కలిసి చరణ్ చాలాసేపు స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. శంకర్ తో సినిమాను ప్రకటించినప్పటికీ అది సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చెప్పడం కష్టం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: