పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను ఇప్పుడు వేరే భాషల్లోకి డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ సినిమా ఎఫెక్ట్ తో ఇక కన్నడ సినిమాలు కూడా ఈమధ్య తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. కన్నడలో స్టార్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పటికే కిరిక్ పార్టీ, ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు రక్షిత్ శెట్టి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. కుక్క టైటిల్ పాత్రలో నటించగా రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తుండడం విశేషం. తెలుగులో ఈసినిమా ‘777 చార్లి’ మూవీతో రాబోతుంది. ఇక రక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. న్యాచురల్ స్టార్ నాని ఈ టీజర్ ను విడుదల చేసి యూనిట్ సబ్యులకు అభినందనలు తెలిపారు. ఇక టీజర్ చూస్తుంటే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ‘ఏంటో ఏమో ఎవరెవరో నిండిన దారుల్లో…’ అంటూ సాగే ఒక పాట ద్వారా మొదలైన టీజర్ లో అనుకోని పరిస్థితుల కారణంగా చార్లి అనే కుక్క తన యజమాని ఇంటి నుంచి పారిపోతుంది. ఆ తరువాత చార్లి పరిస్థితులను ఎదుర్కొంటుంది… రక్షిత్ శెట్టిని ఎలా కలుసుకుంటుంది? అలాగే వారిద్దరూ కలుసుకున్న తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్న పాయింట్ తో సినిమా ఉంటుందని అర్థమవుతుంది.
Happy to release the official teaser of this super cute film #777Charlie, #LifeOfCharlie in Telugu 😊#777CharlieTeaser @rakshitshetty @Kiranraj61 @ParamvahStudios https://t.co/V6XXGp45a3
— Nani (@NameisNani) June 6, 2021
కాగా కిరణ్ రాజ్.కె దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను జి.ఎస్.గుప్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదలకు రెడీ అవుతోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: