ఆత్మ విశ్వాసమే అసలైన అందం -సాయి పల్లవి

Self Confidence Is The True Beauty Says Actress Sai Pallavi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi Latest News,Sai Pallavi New Movie News,Sai Pallavi Next project News,Sai Pallavi Upcoming Movie Details,Sai Pallavi Next Project News,Sai Pallavi Latest Film Details

బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన  సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి, ప్రేక్షకులను ఫిదా చేశారు. తనకు మేకప్ అంటే అసలు ఇష్టముండదనీ , మేకప్ వేసుకోవడం వల్ల తన నేచురల్ అందం పోతుందనీ , మేకప్ లేకుంటేనే బాగుంటాననీ చెప్పే సాయి పల్లవి “ప్రేమమ్‌” చిత్రం లో నటించడానికి ముందు తన ముఖంపై మొటిమలతో ఆందోళన చెందాననీ , మొటిమలు తగ్గడానికి చాలా క్రీములు వాడాననీ , అయినా అవి తగ్గలేదనీ, ఆ మూవీ విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ స్పందన తన ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చిందనీ , ఆత్మవిశ్వాసంతో ఉండడమే నిజమైన అందం అని అర్థం చేసుకున్నాననీ , మనం మనలా ఉండగలగడమే నిజమైన అందం అని తెలుసుకున్నాననీ సాయిపల్లవి చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here