కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు లేకపోవడంతో చిన్న సినిమాలు దాదాపు ఓటీటీలో రిలీజ్ కే చూస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం కాస్త లేట్ అయినా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఇక ‘గుడ్ లక్ సఖి’ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. గతంలో కీర్తి నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో గుడ్ లక్ సఖి కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుందని.. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు కూడా జరిపారని.. త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇస్తున్నారు చిత్ర నిర్మాతలు. సినిమాను ఎలాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రావడం లేదు.. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశం ఉంటే మేమే చెబుతాం.. అప్పటివరకూ ఎలాంటి రూమర్స్ ను నమ్మకండి అంటూ స్పష్టం చేశారు. దాంతో ఈసినిమా థియేటర్స్ లోనే రిలీజ్ కాబోతుందని అన్న వార్తలు మొదలయ్యాయి. ఇక ఈవార్తలపై కూడా నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ కూడా స్పందించి థియేటర్లలో కూడా అని చెప్పేలదు అని చమత్కరించారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతుందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ALSO not true . We dint say that it will go only to theatres. . 🙊🙈 https://t.co/z2biSIkOxo
— shravya varma (@shravyavarma) June 7, 2021
కాగా ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: