నేను టాప్ స్టార్స్ ను సెలక్ట్ చేసుకోను

KGF2 Movie Director Prashanth Neel Makes A Sensational Statement About His Movie Cast Selection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Director Prashanth Neel,Director Prashanth Neel Latest News,Director Prashanth Neel New Movie News,Director Prashanth Neel Upcoming Film News,Director Prashanth Neel Next Project News

కొంతమందికి లక్ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో తెలియదు. అలా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా తీసి సంచలన విజయం దక్కించుకున్నాడు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది కదా ఇంకెవరూ.. కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో దేశం మొత్తానికి ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ నీల్. బ‌డా హీరోలు సైతం ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. నేను నా సినిమాలకు స్టార్ హీరోలను సెలక్ట్ చేసుకోను.. వాళ్లే నాకు సినిమాలు చేసే ఆపర్చునిటీ ఇస్తున్నారు.. స్టార్ హీరోలు కాబట్టి వారిని బట్టి సినిమా భారీ బడ్టెట్ సినిమాలు అవుతాయి అని చెప్పుకొచ్చాడు.

ఇక తెలుగులో మొదటిసారిగా ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. మాఫియా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్‌ స‌ర‌స‌న శృతీహాస‌న్ న‌టిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా నేప‌థ్యంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తికాగానే ప్ర‌శాంత్ త‌న త‌ర్వాతి చిత్రాన్ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seventeen =