‘విరాటపర్వం’ ఎమోషనల్ లవ్ స్టోరీ

Virata Parvam Is An Intense and Emotional Love Story Says Director Venu Udugula,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Virata Parvam,Virata Parvam Latest News,Virata Parvam Movie Updates,Virata Parvam Telugu Movie Latest News,Director Venu Udugula,Director Venu Udugula About Virata Parvam,Venu Udugula About Virata Parvam Telugu Movie

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట‌ప‌ర్వం‘ ( “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌). డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈసినిమా ఏప్రిల్ 30న విడుద‌ల అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవల ఈసినిమా బ్యాక్ డ్రాప్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా చు90ల‌లో తెలంగాణ న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంద‌న్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈవార్తలకు డైరెక్టర్ వేణు ఉడుగుల క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విరాట‌ప‌ర్వం 90ల‌లో తెలంగాణ‌లో జ‌రిగిన ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ.. అప్ప‌టి కాలంలో న‌క్స‌లిజం ప్ర‌భావం లేద‌ని చెప్పలేము.. కానీ ఈ మూవీ నక్సలిజాన్ని హైలెట్ చేయ‌డానికి ప్రయత్నించదు..అదే విధంగా ఆనాటి ప్రజల జీవితంలో ఆ దశలో ఏమి జరిగిందో వివ‌రించి చూప‌డం ఉండ‌దంటూ చెప్పుకొచ్చాడు.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేతపేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here