‘అసురన్’ వెంకటేష్ కు గ్రీన్ సిగ్నల్..!

Priyamani Gives Green Signal To Asuran Remake

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘అసురన్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా గతకొద్ది కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాలో వెంకీ సరసన సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో శ్రేయ వెంకీ పక్కన నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేరే హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. వెంకటేష్ కి సతీమణిగా అసురన్ రీమేక్ లో నటించడానికి ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుండి ఈమె ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘అసురన్’ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. మరి తెలుగులో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 15 =