మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. చిరుకి జోడీగా త్రిష నటిస్తున్న ఈ సినిమాలో మరో కథానాయిక కూడా సందడి చేయనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… `చిరు 152`లో ద్వితీయార్ధంలో ఓ ప్రత్యేక గీతం వస్తుందట. అందులో అందాల తార రెజీనా దర్శనమివ్వనుందని వినికిడి. త్వరలోనే రెజీనా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇప్పటికే మెగా కాంపౌండ్ లో సాయితేజ్, అల్లు శిరీష్ తో రెజీనా కలసి నటించింది. ఇక చిరు బెస్ట్ సాంగ్స్ లో ఒకటైన `గువ్వా గోరింక` (ఖైదీ నంబర్ 786) రీమిక్స్ వెర్షన్ (సుబ్రమణ్యం ఫర్ సేల్)లోనూ రెజీనా చిందులేసింది. మరి… ఇప్పుడు ఏకంగా చిరుతో ఆడిపాడే అవకాశం అందుకున్న రెజీనా… ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























