మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో గోళీసోడా చేతులో పట్టుకొని ఉన్న పోలీస్ గా కనిపిస్తున్నాడు రవితేజ. రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోషిస్తున్నట్టు అర్ధమవుతుంది ఈ పోస్టర్ చూస్తుంటే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు చిత్ర బృందం.
కాగా ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























