విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్

Vijay Devarakonda Forays In To Multiplex Business

పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త బిజినెస్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే దుస్తుల బిజినెస్ , ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విజయ్ ఇప్పుడు మల్టీ ప్లెక్స్ థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ తో కలసి విజయ్ మెహబూబ్ నగర్ లో AVD సినిమాస్ పేరుతో 3స్క్రీన్స్ మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నారు. తరువాత హైదరాబాద్ తో పాటు పలు ఏరియా లలో మల్టీ ప్లెక్స్ బిజినెస్ ప్రారంభిస్తారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలసి AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ థియేటర్ బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్ లో మల్టీ ప్లెక్స్ థియేటర్ కు ప్లాన్ చేశారు. 2020 సమ్మర్ లో AVD సినిమాస్ మల్టీ ప్లెక్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హీరో విజయ్ దేవరకొండకు ఆల్ ది బెస్ట్ చెబుదాం. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన “వరల్డ్ ఫేమస్ లవర్ “మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. విజయ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twenty =