2020లో పలువురు దర్శకులు `ఫస్ట్ టైమ్` రీమేక్ ఎటెంప్ట్ చేస్తున్నారు. వీరిలో సీనియర్ డైరెక్టర్స్ తో పాటు యువ దర్శకులు కూడా ఉండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటివరకు స్ట్రయిట్ పిక్చర్స్ తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న సంక్రాంతికి రానున్న తన నెక్స్ట్ ఫిల్మ్ `ఎంత మంచివాడవురా`ని ఓ గుజరాతీ ఫిల్మ్ ఆధారంగా రూపొందించగా.. తమిళ చిత్రం `తడమ్`కి రీమేక్ గా రామ్ నటిస్తున్న `రెడ్`ని తెరకెక్కిస్తున్నాడు కిషోర్ తిరుమల. ఈ ఇద్దరికీ ఇవే ఫస్ట్ రీమేక్ ఫిల్మ్స్ కావడం విశేషం. ఇక వెంకటేష్ హీరోగా రూపొందనున్న `అసురన్` రీమేక్ ని శ్రీకాంత్ అడ్డాల రూపొందించనున్నాడు. అతనికి కూడా ఇదే ఫస్ట్ రీమేక్ ఎటెంప్ట్.
అలాగే `కేరాఫ్ కంచరపాళెం` అనే స్ట్రయిట్ ఫిల్మ్ తో విమర్శకుల ప్రశంసలు పొందిన వెంకటేష్ మహా.. ఇప్పుడు `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` అనే చిత్రాన్ని తెరకక్కిస్తున్నాడు. మలయాళ చిత్రం `మహేషింటే ప్రతీకారం`కి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. అలాగే `అ`, `కల్కి` వంటి స్ట్రయిట్ పిక్చర్స్ తో అలరించిన ప్రశాంత్ వర్మ… హిందీ `క్వీన్` ఆధారంగా `దటీజ్ మహాలక్ష్మి`ని తెరకెక్కించాడు. అటు వెంకటేష్ మహా, ఇటు ప్రశాంత్ వర్మకి ఇవే ఫస్ట్ రీమేక్స్ కావడం గమనార్హం.
అలాగే హిందీ బ్లాక్ బస్టర్ `రైడ్`ని ప్రవీణ్ సత్తారు రీమేక్ చేయబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది కార్యరూపం దాల్చితే ప్రవీణ్ కి కూడా ఇదే ఫస్ట్ రీమేక్ అవుతుంది.
మరి.. ఫస్ట్ టైమ్ రీమేక్ బాట పట్టిన ఈ దర్శకులందరికీ… సదరు రీమేక్ మూవీస్ ఎలాంటి రిజల్ట్స్ ని అందిస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























