మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `చంటబ్బాయ్`, `దొంగ మొగుడు`, `జేబు దొంగ`, `రౌడీ అల్లుడు`, `జై చిరంజీవ!`.. ఇలా పలు చిత్రాల్లో తన హాస్యాభినయంతో గిలిగింతలు పెట్టారు చిరు. కట్ చేస్తే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనూ మరోమారు తన కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేయనున్నారట మెగాస్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో చిరు కనిపిస్తారని టాక్. కాగా, సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సీరియస్ టోన్ తో సాగినా… ఫస్టాఫ్ మాత్రం ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఉంటుందని వినికిడి. ఇంకా చెప్పాలంటే.. 2005 నాటి చిరంజీవి చిత్రం `జై చిరంజీవ!` తరహాలో అవుట్ అండ్ అండ్ ఫన్ తో సాగుతుందని తెలిసింది. ఇక ద్వితీయార్ధం మాత్రం కొరటాల గత చిత్రాల తరహాలోనే సీరియస్ మోడ్ లో ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న `చిరు 152`.. మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 22న రిలీజయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























