ఈ సారి చిరు టైటిల్ పై డైరెక్ట‌ర్ టార్గెట్

Lokesh Kanagaraj Takes Chiru Movie Title For His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Lokesh Kanagaraj Latest News,Director Lokesh Kanagaraj New Movie News,Lokesh Kanagaraj Next Film Updates

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్ తో ఐదు కొత్త చిత్రాలు సంద‌డి చేశాయి. అయితే, వాటిలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌చిన చిత్రం మాత్రం `ఖైదీ` అనే చెప్పాలి. అల‌నాటి `ఖైదీ` (1983) చిరు కెరీర్ ని మేలిమ‌లుపు తిప్పితే… ఈ నాటి `ఖైదీ` క‌ష్ట‌ద‌శ‌లో ఉన్న కార్తి కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే… త‌న‌కు చిరు టైటిల్ క‌ల‌సి రావ‌డంతో వెనువెంట‌నే `దొంగ‌` టైటిల్ తో సంద‌డి చేశాడు కార్తి. అయితే, `ఖైదీ` త‌ర‌హాలో `దొంగ‌` మాత్రం మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇప్పుడు `ఖైదీ` ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ కూడా కార్తి బాట‌లోనే వెళుతున్నాడు. త‌న నెక్స్ట్ వెంచ‌ర్ కి కూడా మెగాస్టార్ టైటిల్ నే టార్గెట్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ విజ‌య్ హీరోగా న‌టిస్తున్న చిత్రానికి `ఖైదీ` త‌ర‌హాలోనే తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకే టైటిల్ ని ఎంచుకున్నాడు. ఆ టైటిలే… `మాస్ట‌ర్`. 1997లో మెగాస్టార్ కి క‌లిసొచ్చిన ఈ టైటిల్ విజ‌య్ కి కూడా అచ్చొస్తుందేమో చూడాలి. అలాగే… ద‌ర్శ‌కుడు లోకేష్ ఖాతాలో `ఖైదీ` త‌ర‌హాలోనే మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ చేరుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 3 =