వెంక‌టేష్ `శ‌త్రువు` @ 30 వ‌సంతాలు

Venkatesh Shatruvu Completes 30 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Shatruvu Movie Updates,Shatruvu Telugu Movie Latest News,30 Years For Shatruvu Movie,Shatruvu Movie Completed 30 Years

విక్ట‌రీ వెంక‌టేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `శ‌త్రువు` ఒక‌టి. ఈ సినిమాతోనే సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అధినేత ఎం.ఎస్. రాజు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి న‌టించ‌గా.. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ లో కోట శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌న‌మిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ – కోటి సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా `పొద్దున్నే పుట్టింది`, `అమ్మ సంపంగి రేకు` గీతాలు అప్ప‌టి యువ‌త‌రాన్ని విశేషంగా అల‌రించాయి. తెలుగులో విజ‌యం సాధించిన ఈ సినిమాని హిందీలో `విజేత‌` (సంజ‌య్ ద‌త్, ర‌వీనా టాండ‌న్) పేరుతో రీమేక్ చేశారు. 1991 జ‌న‌వ‌రి 2న విడుద‌లైన `శ‌త్రువు`… నేటితో 29 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుని 30లోకి అడుగుపెడుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.