కథానాయికగానే కాదు ప్రత్యేక గీతాల్లోనూ అలరించిన వైనం అందాల తార శ్రియ సొంతం. రెండేళ్ళ క్రితం తన రష్యన్ ప్రియుణ్ణి రహస్యంగా మనువాడిన ఈ ఉత్తరాది సోయగం.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలపై దృష్టి పెడుతోంది. గత ఏడాది జనవరిలో `యన్టీఆర్ కథానాయకుడు`లో అతిథి పాత్రలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఈ ఏడాది జనవరిలో ఓ హిందీ చిత్రం కోసం కనువిందు చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అలనాటి అందాల నటి పద్మిని కోల్హపురి తనయుడు ప్రియాంక్ శర్మ, ప్రముఖ నటుడు రవికిషన్ తనయ రెవా కిషన్ జంటగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా `సబ్ కుశల్ మంగళ్` పేరుతో ఓ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని నిర్మించడమే కాకుండా… ఓ కీలక పాత్రలో నటించాడు. ఇందులో `నయా నయా లవ్` అంటూ సాగే గీతంలో శ్రియ తళుక్కున మెరిసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో శ్రియ ప్రత్యేక గీతాలు చేసినా.. పెళ్ళయ్యాక చేసిన ఫస్ట్ స్పెషల్ నంబర్ ఇదే కావడం విశేషం. కాగా, జనవరి 3న అంటే రేపు `సబ్ కుశల్ మంగళ్` థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























