‘చిరు152’ షూటింగ్ ప్రారంభం

Chiru152 Movie Shooting Begins In Hyderabad,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie News,Megastar Chiranjeevi 152nd Film Shooting Begins In Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో సినిమా వస్తున్న సంగ‌తి తెలిసిందే. గత ఏడాదే ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియచేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇందులో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరు క‌నిపించ‌నున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న `చిరు 152`ని రిలీజ్ చేయాల‌ని చెర్రీ భావిస్తున్నాడ‌ని తెలిసింది. మరి ఇప్పుడే షూటింగ్ మొదలైంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘సైరా’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =