`మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు`(2015)తో తెలుగునాట సంగీత దర్శకుడిగా తొలి అడుగేసిన మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపీసుందర్… అనతికాలంలోనే టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశాడు. పలు విజయవంతమైన చిత్రాలతో ఇక్కడ కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే, గత ఏడాది మొత్తమ్మీద బ్లాక్ బస్టర్ మూవీ `మజిలీ`కి మాత్రమే బాణీలు అందించిన గోపి… ఈ ఏడాది మాత్రం వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా… 2020 ఫస్టాఫ్ లో గోపీసుందర్ నుంచి ఐదు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. జనవరిలో `ఎంత మంచివాడవురా`, `నిశ్శబ్దం`, `చూసీ చూడంగనే` రిలీజ్ కానుండగా… ఫిబ్రవరిలో `వరల్డ్ ఫేమస్ లవర్` రిలీజ్ కానుంది. ఇక ఏప్రిల్ లో `అఖిల్ 4` విడుదల కానుంది. మరి… తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ ఐదు చిత్రాలతో గోపీసుందర్… ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























