పేరు మార్పు కలిసొస్తుందా..?

Does Name Change Results In Better Luck?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,World Famous Lover Movie Updates,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Latest Film Details,Vijay Deverakonda Upcoming Movie News

కాలం కలిసిరానప్పుడు అప్పుడప్పుడు సెంటిమెంట్స్ ను నమ్ముకోకతప్పదు. అందుకే మన హీరోలు అతీతమేం కాదు. వాళ్ళు కూడా కాస్త టైం బ్యాడ్ నడుస్తున్నాప్పుడు సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మెగా హీరో సాయి తేజ్ కూడా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ నుండి.. సాయి తేజ్ కు మార్చుకున్నాడు. పేరు మార్చడం వల్లనో.. కథ వల్లనో చెప్పలేం కానీ మొత్తానికి ‘చిత్రలహరి’, వెంటనే ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ హీరో కూడా పేరు మార్చుకున్నాడు. అతనెవరో కాదు రౌడీ హీరో గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా పేరు తలుచుకుంటే వెంటనే గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. అంతలా ప్రేక్షకుల్లోకి ఎక్కింది ఈ సినిమా. విజయ్ దేవరకొండ కంటే తనను అర్జున్ రెడ్డే అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు సైతం. ఇక అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. ‘అర్జున్ రెడ్డి’ కిక్ లో వున్న అభిమానులకు వెంటనే ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ వుంది. ఇక ఎంత హిట్స్ వచ్చినా అప్పుడప్పుడు ప్లాప్స్ కూడా పలకరిస్తూనే ఉంటాయి. అలా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న విజయ్ స్పీడ్ కు కూడా బ్రేక్ పడింది. ‘నోటా’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. దీనితో విజయ్ కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు.

ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. వాటికి మంచి రెస్పాన్స్ రాగా.. నిన్న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కు కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో అర్జున్ రెడ్డి షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని కొంతమంది విమర్శలు చేస్తున్నా.. మరో పక్క కొంతమందికి బాగానే నచ్చింది.

అయితే టీజర్ లో విజయ్ దేవరకొండ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరికీ విజయ్ దేవరకొండగా మాత్రమే తెలిసిన ఈ హీరో పేరుని టీజర్ లో దేవరకొండ విజయ్ సాయి అని వేశారు. నిజానికి విజయ్ దేవరకొండ పూర్తి పేరు…దేవరకొండ విజయ్ సాయి. కానీ మనకు విజయ దేవరకొండ అని మాత్రమే తెలుసు. విజయ్ దేవరకొండగానే ఫేమస్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం తన పేరుని మార్చి స్క్రీన్ పై వేశాడు. దీనితో గత సినిమాల రిజల్ట్స్ తో తన పేరులో మార్పులు చేసి ఉంటాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ పేరు మార్పుతో అయినా విజయ్ కు కలిసొస్తుందేమో చూద్దాం..

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సాయి పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.